ఎల్బీనగర్, వెలుగు: తన భార్యను అతి కిరాతకంగా హత్య చేసిన కేసులో రిటైర్డ్ ఆర్మీ జవాన్ గురుమూర్తికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. బుధవారం వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో గురుమూర్తికి వైద్యపరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టుకు తీసుకెళ్లారు.
దీంతో నిందితుడికి కోర్టు ఫిబ్రవరి11 వరకు రిమాండ్ విధించింది. ఈ క్రమంలోనే ఆయన్న మీర్పేట్ పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. కాగా, గురుమూర్తికి బెయిల్ ఇవ్వాలంటూ ఓ అడ్వకేట్ కోర్టులో పిటిషన్ వేశారు. అయితే, తనకు బెయిల్ వొద్దని గురుమూర్తి న్యాయమూర్తికి చెప్పాడు.